హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కర్ణాటకలో ఏడు తలల పాము కుబుసం

జాతీయం15:41 PM October 12, 2019

కర్ణాటకలోని కనకపుర సమీపంలోని మరిగౌడన దొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఏడు తలల నాగుపాము కుబుసం(చర్మం) కనిపించింది. దీంతో చుట్టుపక్కల జనమంతా అక్కడికి క్యూ కట్టారు. గత ఆర్నెళ్ల క్రితం కూడా అక్కడ ఏడు తలల నాగుపాము చర్మం కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రదేశం మహిమాన్విత ప్రదేశంగా వారు భావిస్తున్నారు. పురాణాల్లోనూ ఏడు తలల పాము ప్రస్తావన ఉండటాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు.మరికొందరు మాత్రం విష్ణుమూర్తి కూడా ఏడు తలల పాము పైనే నిద్రిస్తాడు కాబట్టి.. మరిగౌడన దొడ్డి గ్రామంలో కనిపించింది ఏడు తలల పాము కుబుసమే అంటున్నారు. మొత్తం మీద దాని కుబుసం వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది.

webtech_news18