మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వశమైన కీలక రాష్ట్రం మధ్యప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కమల్‌నాథ్‌తో ప్రమాణం చేయించారు. భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.