HOME » VIDEOS » National

Video : జార్ఖండ్‌ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

ఇండియా న్యూస్13:09 PM December 23, 2019

Jharkhand Election Results 2019 : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... కాంగ్రెస్, JMM కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇస్తున్నాయి. అధికార బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... కాంగ్రెస్, JMM కూటమికి 42 స్థానాల్లో ఆధిక్యం ఉంది. AJSU 4, ఇతరులు 8 స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఈ ఫలితాలే దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే... ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులకూ, తమ సమీప ప్రత్యర్థులకూ మధ్య ఓట్ల గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అదీకాక... బీజేపీకి ఆధిక్యం చాలా తక్కువగా ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 81. అందువల్ల మేజిక్ మార్కు 42. ఆ ప్రకారం చూస్తే... కాంగ్రెస్ కూటమికి అధికార పగ్గాలు చేపట్టే ఛాన్స్ క్లియర్‌గా కనిపిస్తోంది. అందుకే ఆ ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్... నెక్ట్స్ సీఎంగా... జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ప్రకటించేసింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి.

webtech_news18

Top Stories