హోమ్ » వీడియోలు » జాతీయం

Video : షాకింగ్ సీన్... జామియా విద్యార్థులను చితకబాదిన పోలీసులు...

జాతీయం11:54 AM February 16, 2020

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ లైబ్రరీలో విద్యార్థులపై పోలీసుల దాడి చేసినట్లున్న సీసీటీవీ ఫుటేజ్‌ని రిలీజ్ చేసింది జామియా కోఆర్డినేషన్ కమిటీ. ఇందులో పోలీసులు ఎంఏ/ఎంఫిల్ లైబ్రరీలోకి వెళ్లి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్ని లాఠీలతో కొడుతున్న దృశ్యాలున్నాయి. పోలీసుల పాశవికంగా దాడి చేశారని జామియా కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. పోలీసులు, ప్రభుత్వం చెప్పినట్లు వినే కొంతమంది తీవ్రవాదులు విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించింది. 2019 డిసెంబర్ 15న ఇది జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం CAAకి వ్యతిరేకంగా జామియా విద్యార్థులు ఆందోళన చేశారు. అది తీవ్ర రూపం దాల్చింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వర్సిటీలోకి వెళ్లారు. కాలేజీ లైబ్రరీ, బాత్‌రూమ్స్‌లోకి వెళ్లి విద్యార్థులపై దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై శాంతియుత పరిస్థితులు ఏర్పడ్డాక విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

webtech_news18