అనురాధ టీ.కే... ప్రఖ్యాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లో స్పెషలైజ్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ విభాగానికి డైరెక్టర్ ఈమె. జీశాట్12, జీశాట్ 10 ఉపగ్రహ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. ఇస్రోలోనే సీనియర్ మోస్ట్ మహిళా సైంటిస్ట్. 1982లో ఇస్రోలో చేరిన అనురాధ.. తొలి మహిళా శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమె 1961లో జన్మించారు. బెంగళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచిలర్స్ పట్టా పొందారు.