భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన కార్టోశాట్-3 సహా 13 అమెరికా నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు.