హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చేపల కోసం వల వేస్తే... అది దొరికింది...

జాతీయం13:54 PM December 03, 2019

చెన్నైలో ఓ మత్స్యకారుడు... వానలో కూడా చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లాడు. ఎలాగైనా పెద్ద చేపల్ని పడతా అంటూ తన తోటి వాళ్లకు సవాల్ విసిరాడు. అంతా బాగానే ఉంది. వల వేశాడు. ఏదో పెద్ద చేప తగిలినట్లు ఫీలయ్యాడు. వాల లాగాడు. రాలేదు. గట్టిగా లాగాడు. రాలేదు. పెద్ద తిమింగలం పడిందేమో అనుకున్నాడు. శక్తి మొత్తం కూడేసి గట్టిగా లాగాడు. అప్పుడు కదిలింది వల. అలా అలా ఒడ్డుకు లాక్కొచ్చి చూస్తే... అది కాస్తా ఇస్రో వాళ్లు పంపే రాకెట్ ఇంజిన్ అని తేలిసింది. తుప్పుపట్టిన ఆ ఇంజిన్... రీసైక్లింగ్ చేసి వాడేందుకు వీలు లేదు. అయినప్పటికీ అది దొరకడం... చేపలు చిక్కడం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందంటూ నవ్వేశాడు ఆ జాలరి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading