నాలుగేళ్ల చిన్నారి రేప్‌కు గురైందని..డిల్లీలోని ఓ హాస్పటల్‌పై దాడి చేశారు బాలిక బందువులు. వివరాల్లోకి వెళ్తే.. ఓ 40 ఏళ్ల వ్యక్తి, నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేశారని ఆరోపిస్తూ..ఆ బాలికను వైద్య పరిక్షల కోసం ఢిల్లీలోని మహర్షి వాల్మీకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే ఏమైందో ఏమో కాని.. కోపోద్రేకులైన బాలిక బందువులు.. పసిమొగ్గను చిదిమేస్తారా..అంటూ దవాఖానలోని పర్నిచర్‌ను ద్వంసం చేశారు. దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు మాత్రం..కొంత మిస్ కమ్యూనికేషన్ వల్ల ..ఈ ఘటన జరిగిందని..ప్రస్తుతం అంత సద్దుమనిగిందని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.