భారత్ బంద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. మల్దా జిల్లా సుజాపూర్లో కొందరు ఆందోళనకారులు వాహనాలను తగులబెట్టారు. పలు చోట్ల ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఐతే పోలీసులు వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు వెైరల్ కావడంతో.. దీని వెనక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.