దేశమంతా కాషాయ గాలి వీస్తుంటే.. కేరళలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ క్లీన్ స్వీప్ దిశగా దూసువెళ్తోంది. 20 లోక్‌సభ స్థానాలకు గాను 19 సీట్లలో హస్తం పార్టీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.