పొఖ్రాన్ (రాజస్థాన్)లోని ఆయుధ పరీక్ష కేంద్రంలో M-777 శతఘ్నులను ప్రయోగించింది భారత ఆర్మీ. ఈ శతఘ్నులతో బాంబులను వదిలి లక్ష్యాన్ని ఢీకొట్టింది. ఈ ప్రయోగంలో 8-10 ఇంచుల కాంక్రీట్ గోడలు సైతం బద్ధలయ్యాయి. శత్రువులపై ప్రయోగిస్తే భారీ ఎత్తున నష్టం కలిగించే సామర్థ్యం వీటికి ఉందని అధికారులు వెల్లడించారు.