హోమ్ » వీడియోలు » జాతీయం

Video: విద్యార్థులపై లాఠీచార్జ్.. జేఎన్‌యూ వద్ద ఉద్రిక్తత...

జాతీయం19:14 PM November 11, 2019

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వద్ద వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ ఫీజుల పెంపుతో పాటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎన్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వర్సిటీ క్యాంపస్‌ బయట పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. వాటర్ కేనన్లతో విద్యార్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థుల ఆందోళనతో జేఎన్‌యు ప్రాంగణం దద్ధరిల్లింది. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. గేటువైపు దూసుకొస్తున్న కొంతమంది విద్యార్థులను పట్టుకొని పోలీసులు చితకబాదారంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading