HOME » VIDEOS » National

Video : జలియన్ వాలాబాగ్ మారణహోమానికి వందేళ్లు

ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్ పట్టణంలో ఉన్న ఓ తోటలో వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే బ్రిటీష్ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న జాతీయ ఉద్యమకారులు కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడాన్ని తీవ్రంగా పరిగణించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం.. జనరల్ డయ్యర్ సారథ్యంలో కాల్పులు జరిపించింది. ఈ కాల్పుల్లో 1000మందికి పైగా మరణించారు. జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటికి సరిగ్గా వందేళ్లు. బ్రిటీష్ సర్కార్ దాష్టికానికి అమరులైన వేలమంది పౌరులకు నేడు భారత్ నివాళులు అర్పిస్తోంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు వారికి నివాళులు అర్పించారు.

webtech_news18

Top Stories