మహారాష్ట్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజంతా వానలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత త్రయంబకేశ్వర్ ఆలయంలోకి వరద నీరు వచ్చేసింది. ఆ ప్రవాహ ఎంతలా ఉందంటే... కనీసం భక్తులు ఆ నీటిలో నిలబడే పరిస్థితి కూడా లేదు. ఆ ఫోర్స్‌కి ఎవరైనా సరే కొట్టుకుపోవడం ఖాయం. ఆ స్థాయిలో నీరు వచ్చేయడంతో... ఆలయానికి భక్తుల రాకపోకలు ఆగిపోయాయి. త్రయంబకేశ్వరుడికి పూజలు చేసే వీలు కూడా లేకుండా పోయింది.