పటేదార్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పరిఖ్ను హార్థిక్ వివాహం చేసుకున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలోని ములి తాలుకాలోని దిగ్సర్ గ్రామంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. హార్థిక్ ఫ్యామిలీ కులదైవమైన బహుచార్ అండ్ మెల్దీ మాతా ఆలయంలో కేవలం 100మంది గెస్ట్ లతో చాలా సింపుల్గా వీరి వివాహ కార్యక్రమం జరిగింది. వివాహ అనంతరం దంపతులు హార్థిక్ స్వస్థలం విరంగ్రంకు వెళతారని సన్నిహితులు తెలిపారు.