గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోర్బి జిల్లాలోని కల్యాణ్‌పూర్ విలేజ్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ చిక్కుకున్న ఇద్దరు చిన్నారుల్ని పృధ్విరాజ్ జడేజా అనే కానిస్టేబుల్ తన భుజాలపై ఎక్కించుకొని కీలోమీటర్ కన్నా ఎక్కువ దూరం నడిచాడు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.