HOME » VIDEOS » National

Video : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏర్పాట్లు పూర్తి

ఇండియా న్యూస్07:51 AM December 23, 2019

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని నేడు ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్, 21న ఐదోదశ ఓటింగ్ జరిగింది. తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, జేఎమ్ఎమ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. 2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించినా, వారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీకి 2014లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎమ్ఎమ్, ఆర్ఎల్డీ కలసి పోటీ చేశాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ 79 సీట్లలో బరిలో సొంతంగా బరిలో దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 సీట్లలో పోటీ చేశాయి.

webtech_news18

Top Stories