భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ పదవి విరమణ చేసిన ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. సీడీఎస్‌గా నియమితులైన వెంటనే సైనికుల గౌరవ వందనం స్వీకరించారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పదవితో తనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. 28వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నవరాణేకు అభినందనలు తెలిపారు. కాగా, రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు.