HOME » VIDEOS » National

Video : అంబానీ ఇంట్లో వైభవంగా గణేశ్ చతుర్థి వేడుకలు

ఇండియా న్యూస్16:48 PM September 03, 2019

దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి కోలాహలం నెలకొంది. మంటపాల్లో కొలువైన గణనాథులను ప్రజలు భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. ప్రతీ ఏటా లాగే ముంబై నగరంలో ప్రతీ గల్లీ గణనాథుని నామస్మరణతో మారుమోగిపోతోంది. ముంబైలోని అంటిల్లాలో ఉన్న రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట్లోనూ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన మంటపంలో గణనాథునికి విశిష్ట పూజలు జరిపిస్తున్నారు. ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సహా కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశ్ అంబానీ,శ్లోకా మెహతాల పెళ్లి తర్వాత వచ్చిన మొదటి గణేశ్ చతుర్థి కావడంతో.. అంబానీ కుటుంబంలో ఈ వేడుకలను మరింత స్పెషల్‌గా భావిస్తున్నారు.

webtech_news18

Top Stories