గతకొన్ని నెలల హైడ్రామాకు తెరదించుతూ 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీశారు. ఇవాళ ఉదయం 5.30 గం.లకు నలుగురు రేపిస్టులకు ఉరిశిక్షను అమలు చేశారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని సంబరాలు చేసున్నారు. ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకున్నారు. నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు.