హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మొసలిని గుడిలో బంధించి పూజలు... ఎందుకో తెలుసా...

జాతీయం09:48 AM June 24, 2019

Gujarat : గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లాకు వెళ్తే... అక్కడ మీకు ఖొడియార్ మాత ఆలయం కనిపిస్తుంది. ఆమెను నర్మదా మాత అని కూడా పిలుస్తారు. మొసలిని వాహనంగా చేసుకున్న ఆ దేవత... మొసలిపై నిల్చున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడా ఆలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గుజరాత్ ప్రజలకు మొసళ్లంటే ఎక్కడ లేని భక్తి. నర్మదా నదిలో కూడా మొసళ్లు చాలా ఎక్కువ. మొసలి కనిపిస్తే పూజలు చేసేస్తారు. తాజాగా అదే జరిగింది. ఖొడియార్ మాత ఆలయానికి ఓ మొసలిని తెచ్చి పూజలు చేశారు. ఊరి ప్రజలంతా వచ్చి... ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజల విషయం అటవీ శాఖ అధికారులకు తెలిసింది. మళ్లీ మొదలుపెట్టారా... ఎన్నిసార్లు చెప్పినా వినరు అనుకుంటూ... ఆ గుడిలోకి వెళ్లి మొసలిని కాపాడదామనుకున్నారు. ప్రజలు ఊరుకుంటేగా... ఆలయ ద్వారం మూసేసి... అడ్డుగా నిలబడ్డారు. అయినప్పటికీ ఒప్పుకోని అధికారులు బలవంతంగా లోపలికి వెళ్లి మొసలిని కాపాడారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading