ముంబై సహా సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, ముంబై సబర్బన్, పాల్ఘర్, అలీబాగ్, విరార్, భివండీ, కల్యాణ్, డొంబీవలి, బోరీవలితో పాటు పాటు పొరుగునే ఉన్న థానే జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. అయితే.. ముంబైలోని ఓ ప్రాంతంలో వర్షం వల్ల రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండిపోయాయి. ఓ భారీ గుంతలో చేపలు దర్శనమిచ్చాయి. దాన్ని చూసిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై కూర్చొని గాలం వేసి చేపల్ని పట్టుకున్నాడు.