దేశంలోనే మొట్టమొదటిసారిగా కంటిచూపు లేకుండా ఓ యువతి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ప్రాంజల్ పాటిల్ అనే అమ్మాయికి రెండు కళ్లు కనిపించవు. అయినా కూడా ఆమె ఎక్కడా అధైర్య పడలేదు. నిరుత్సాహానికి గురికాలేదు. పట్టుదలతో చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ప్రస్తుతం తిరువనంతపురం సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా ఆమెకు తిరువనంతపురంలో ఘన స్వాగతం లభించింది.