ఢిల్లీ... పశ్చిమపురిలోని ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్... 250కి పైగా కొంపల్ని కాల్చేసింది. భారీగా మంటలు చెలరేగి 250కి పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. 26 ఫైర్ ఇంజిన్లతో ప్రయత్నిస్తేగానీ మంటలు అదుపులోకి రాలేదు. ఆ ప్రాంతం అంతా పొగతొ నిండిపోయింది. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళ దుర్ఘటన జరగడంతో తమ సామాన్లన్నీ కాలిపోయాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం ఉదయం 3.30 గంటలకు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది చనిపోగా... 35 మంది గాయపడ్డారు.