గుజరాత్... బనస్కాంత జిల్లాలోని ఓ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. చండీసార్లో ఉన్న ఆ మిల్లు దగ్గరకు అగ్ని మాపక దళాలు వేగంగా వచ్చాయి. అరగంటపాటూ కష్టపడి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఎవరికీ గాయాలు కాకపోయినా ఆస్తి నష్టం మాత్రం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని అనుకుంటున్నారు. కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.