న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. కేరళ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు పవర్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. 8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ప్రమాదం జరిగింది.