దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది రైతన్నలు ఢీల్లీలోని పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ పాదయాత్రగా వస్తున్న రైతులు పార్లమెంట్ ఎదుట మహాసభను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రముఖ సామాజికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైతులు భారీగా తరలిరావడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తమ పంటలకు గిట్టుబాటు ధర, రుణాలు మాఫీ సహా తమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానం ప్రస్తుతం రైతుల నినాదాలతో మారుమోగింది.