తీరం వైపు ఫొని తుఫాన్ దూసుకొస్తోంది. తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ, ఒడిశా తీరాన్ని ముంచెత్తేందుకు తరుముకొస్తోంది. మే 3న పారాదీప్ సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో పెనుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తాయని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్లు, యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచారు.