కర్నాటక మంత్రి HD రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ప్రజ్వల్‌కు తన సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. హసన్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజ్వల్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు దేవెగౌడ. మనవడి పేరును ప్రకటిస్తున్న సమయంలో కంటతడిపెట్టుకున్నారు. తనలాగే ప్రజ్వల్ని కూడా ఆదరించాలని ప్రజలను కోరారు. దేవెగౌడ కన్నీళ్లను చూసి మనవడు ప్రజ్వల్, కుమారుడు రేవణ్ణ సైతం భావోద్వేగానికి లోనయ్యారు.