ఏనుగులు ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తాయి. ప్రాణాలు తీసేందుకు కూడా ఏమాత్రం వెనకాడవు. అలాంటి సందర్భం ఒడిశాలో వచ్చింది. ఓ ఏనుగు దగ్గర కేకలు పెడుతున్న టూరిస్టులను చూసిన గజానికి ఒళ్లు మండింది. వాళ్ల అంతు చూసేందుకు పరుగులు పెట్టింది. అంతే... ఆ టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రన్నింగ్ మొదలుపెట్టారు. ఆ ముగ్గురిలో ఒకడు కింద పడ్డాడు. ఆ ఏనుగు తలచుకుంటే... అతన్ని ఒక్క దెబ్బకు చంపేసేదే. కానీ ఎందుకో అది జాలి తలచింది. అతను రెండుసార్లు తన కాలికి చిక్కినా... చంపకుండా వదిలేసి... జాలి చూపింది. అందుకే అతన్ని అందరూ అదృష్టవంతుడు అంటున్నారు.