హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నోయిడా రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

Uncategorized01:14 PM IST Mar 29, 2019

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 30మంది తీవ్రంగా గాయపడగా.. వారిని సమీపంలోని కైలాష్ ఆసుపత్రికి తరలించారు. యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలియగానే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గౌతమ్ బుద్ద నగర్ పోలీసులు, సంబంధిత అధికారులను అక్కడికి పంపించి పరిస్థితి సమీక్షించాల్సిందిగా ఆదేశించారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

webtech_news18