మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. పీకల దాకా తాగి కారు స్టీరింగ్ పట్టిన యువతి..రోడ్డుపై బీభత్సం సృష్టించింది. కారును వెనకకు తిప్పే క్రమంలో మరో మూడు కార్లను ఢీకొట్టింది. ముందుకూ వెనకకూ కారును పోనిస్తూ పదేపదే వాటిని ఢీకొట్టింది. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన జరిగింది.