HOME » VIDEOS » National » DELHI TRAFFIC POLICE MAKE FINES AS ODD EVEN SYSTEMS COMES INTO EFFECT FROM TODAY NK

Video - అటు పొగ... ఇటు పెనాల్టీ... ఢిల్లీలో షాకులపై షాకులు

ఇండియా న్యూస్12:38 PM November 04, 2019

Delhi Pollusion : ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంతకీ తగ్గకపోవడంతో... అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం... పాత అస్త్రాన్ని మళ్లీ రోడ్డుపైకి తెచ్చింది. అదే సరి-బేసి సంఖ్య విధానం. ఇవాళ్టి నుంచీ ఈ విధానం అమల్లోకి వచ్చింది. వాహనాల నంబర్ బోర్డుల్లో చివర సరి సంఖ్య ఉంటే... ఓ రోజు... బేసి సంఖ్య ఉంటే మరో రోజు ఆ వాహనాలు రోడ్డెక్కాల్సి ఉంటుంది. ఈ రూల్ నెల 15 వరకూ కొనసాగనుంది. ఆదివారం మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇవాళ సరిసంఖ్య ఉండే వాహనాలు రోడ్డెక్కాయి. అందువల్ల రేపు బేసి సంఖ్య ఉండే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై కనిపిస్తాయి. ఉదయం 8 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఈ రూల్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత వాహనాల రద్దీ కాస్త తగ్గుతుంది కాబట్టి... ఏ వాహనమైనా వేసుకెళ్లొచ్చు. కానీ... ఈ రూల్ తేవడంతో... ఇవాళ బేసి సంఖ్యతో వాహనాలు నడుపుతున్నవారిపై ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. అసలే పొగతో నానా తిప్పలు పడుతుంటే... ఈ ఫైన్ల మోతేంటని ప్రజలు లబోదిబోమంటున్నారు.

webtech_news18

Top Stories