HOME » VIDEOS » National » DELHI AIR QUALITY INDEX DELHI VICTIM OF SICK CHOKE DUE TO AIR POLLUTION NK

Video : ఢిల్లీకి పొల్యూషన్ దెయ్యం పట్టిందా?

ఇండియా న్యూస్11:36 AM November 04, 2019

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదంటే... మన దేశ రాజధాని ఢిల్లీ అని చెప్పుకోవాల్సి రావడం మన దురదృష్టమే. ఈ గుర్తింపు ఇచ్చింది ఎవరో కాదు... ఎయిర్ విజువల్ వెబ్‌సైట్. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం... బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కంటే... 7 రెట్లు ఎక్కువగా ఉంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ వాయుకాలుష్యం ఉన్న రెండో నగరంగా ఢాకా నిలిచింది. మన ఇంటిపక్కన ఎవరైనా మంట పెడితే... పొగ వచ్చి... కాసేపు ఊపిరి ఆడనట్లు ఫీలవుతాం. ఢిల్లీలో ప్రజలు రోజంతా ఈ ఫీలింగ్‌తోనే ఉంటున్నారు. ఇక ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నవారికి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఊపిరి ఒక్కటే కాదు... కళ్లు కూడా మండుతున్నాయట. ఇంత పొగ రావడానికి కారణం చలికాలమో, దీపావళో కాదు... ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లో పంట వ్యర్థాల్ని తగలబెడుతున్నారు. అక్కడి నుంచీ పొగ ఢిల్లీకి వచ్చి... నరకం చూపిస్తోంది. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది.

webtech_news18

Top Stories