కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య తనకు తరచుగా ఆయుధాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. 303 రైఫిల్ ఎంత పవర్ ఫుల్లో అందరికీ తెలుసన్న ఆయన.. బీజేపీకి 303 సీట్లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో త్రీ నాట్ త్రీ ఎంత పవర్ ఫుల్లో తెలుసుకదా అని చమత్కరించారు.