RIP Arun Jaitley : మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఓ మంచి స్నేహితుడ్ని కోల్పోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కోలిగ్ను కూడా కోల్పోయానంటూ ఆయన ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెషన్ పరంగా ఆయన ఓ లాయర్... ఫ్యాషన్ పరంగా ఆయన ఓ పొలిటీషియన్ అంటూ... జైట్లీని కొనియాడారు. అరుణ్ జైట్లీ వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. అరుణ్ జైట్లీకి సీరియస్‌గా ఉందనే విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈనెల 9న ఎయిమ్స్‌కు వెళ్లారు. అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల ఆరో తేదీన కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మరికొన్ని రోజుల్లోనే మరో కీలక నేత చనిపోవడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.