HOME » VIDEOS » National

Video : నాన్నకు ప్రేమతో... హృదయాల్ని కదిలిస్తున్న వీడియో

ఇండియా న్యూస్11:59 AM December 17, 2019

తండ్రి కోసం తపిస్తున్న ఆ చిన్నారి... తన తండ్రి విగ్రహాన్నే తండ్రిగా భావిస్తూ... ముద్దుపెట్టి... ప్రేమ కురిపించింది. ఆది చూసిన ప్రతి ఒక్కరి హృదయమూ కరిగిపోతోంది. ఛత్తీస్‌గఢ్‌... కోర్బాలో ఎస్సై మూలచందర్‌ గతేడాది మావోయిస్టుల దాడిలో చనిపోయారు. ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి. కొన్ని రోజులకి ఆమె పాపకు జన్మనిచ్చింది. తాజాగా మూలచందర్‌ జయంతి నాడు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ పాపకు మీనాన్న అని విగ్రహాన్ని చూపించగానే... చిన్నారి విగ్రహం దగ్గరకు వెళ్లి నాన్నా అంటూ పలకరించింది. విగ్రహాన్ని కౌగలించుకుని ముద్దుపెట్టుకుంది. విగ్రహానికి స్వీట్ తినిపించబోయింది. తండ్రి పట్ల కూతురు చూపిస్తున్న ప్రేమను చూసి కుటుంబ సభ్యులే కాదు... నెటిజన్లు కూడా కన్నీరు పెడుతున్నారు.

webtech_news18

Top Stories