హోమ్ » వీడియోలు » జాతీయం

Cyclone Vayu: గుజరాత్‌ వైపు ‘వాయు’వేగంతో దూసుకొస్తున్న తుఫాన్.. అప్రమత్తమైన అధికారులు

జాతీయం13:56 PM June 12, 2019

‘వాయు’ తుఫాను గుజరాత్‌ తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, డామన్‌ అండ్‌ డయ్యూల్లో వర్షాలు పడుతున్నాయి. అరేబియా మహా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా మారింది. ఇది రాత్రికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా మహాసముద్రంలో ఉన్న ఈ తుఫాన్‌, ఉత్తరంగా పయనించి 13వ తేదీ ఉదయానికి గుజరాత్‌లోని పోరుబందర్‌-మహువా మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న అన్ని రైళ్లను ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం వరకు నిలిపివేయనున్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

Shravan Kumar Bommakanti