హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అల్లకల్లోలంగా బెంగాల్‌... దూసుకెళ్తున్న ఫొణి తుఫాను

జాతీయం11:47 AM May 04, 2019

ఒడిశాపై విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఫొణి తుఫాను... గంటకు 20 కిలోమీటర్ల వేగంతో... ఉత్తరంవైపు కదులుతూ... ఈశాన్యంవైపుగా వెళ్తోంది. వచ్చే 2 గంటల్లో అది పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తీరం దాటబోతోంది. ఆ సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ... పరిస్థితి తలకిందులైతే... గంటకు 105 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే ప్రమాదం ఉందంటున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నపూర్, దిఘా, కోల్‌కతాపై ఎక్కువ ప్రభావం చూపేలా ఉందంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతాలోని హల్దియా ఓడరేవును మూసేశారు. హౌరా-చెన్నై మార్గంలోని 220 రైళ్లను రద్దు చేశారు. కోల్‌కతాలో స్కూళ్లకు సెలవిచ్చారు. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ మిడ్నపూర్, నార్త్, సౌత్ 24 పరగణాలు, హౌరా, జార్‌గ్రామ్, కోల్‌కతా, సుందర్బన్ అడవులపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 48 గంటలపాటూ ఎన్నికల ప్రచారానికి గుడ్ బై చెప్పారు.

Krishna Kumar N