జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కేంద్రం అక్కడ కర్ఫ్యూ విధించింది. అంతకుముందు రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధించిన కేంద్రం.. రాజ్యసభలో అమిత్ షా ప్రకటన తర్వాత కర్ఫ్యూ విధించింది. ఇందుకోసం అదనపు బలగాలను అక్కడ మోహరించింది. కర్ఫ్యూ అమలులో ఉన్నంతవరకు ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు
రావడానికి వీలు లేదు.