సీఆర్పీఎఫ్ జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. మారుమూల అడవుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు. సుమారు 8కి.మీ. పాటు యువకుడిని మంచంపై మోసుకెళ్లి తమ క్యాంప్‌లో వైద్యం అందించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది.