మన సైనికులది గొప్ప హృదయం..! దేశం కోసం వీరోచితంగా పోరాడమే కాదు..కష్టాల్లో ఉన్నవారిని మానవత్వంతో ఆదుకుంటారు. తుపాకీ పట్టిన చేతులతోనే తోటి మనిషికి సాయం చేస్తారు. ఇది మరోసారి రుజువైంది. కాశ్మీర్లో ఆకలితో ఉన్న చిన్నారికి తన లంచ్ బాక్స్ ఇచ్చాడు జవాన్. అతడికి కాళ్లు చేతులూ పనిచేయవని తెలిసి..స్వయంగా తన చేతులతో గోరుముద్దలు తినిపించాడు. శ్రీనగర్‌లోని నవాకాదల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.