అతనో ట్రాఫిక్ పోలీస్. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పేరు హీరా లాల్. తన టాలెంట్ బయటపెట్టాడు. అందరూ చూస్తండగా... రెండుసార్లు జీపును తన బాడీ పైనుంచీ పోనిచ్చాడు. అలాగే... రెండు జీపుల మధ్య ఉండి... రెండింటినీ ముందుకు రానివ్వకుండా అడ్డుకున్నాడు. ఇలాంటి స్టంట్స్ చెయ్యగలగడానికి సీక్రెట్ ఏంటి అని అడిగితే... యోగా అని చెప్పాడు. అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.