కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI నుంచీ బీజేపీ, భజ్రంగ్ దళ్... డబ్బులు తీసుకున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై అందరూ దృష్టిసారించాలని కోరారు. ముస్లింల కంటే... ముస్లిమేతరులు... ISI తరపున గూఢచారులుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ అర్థం కావాల్సి ఉందన్నారు దిగ్విజయ్ సింగ్.