ఉల్లి ఇప్పుడు బంగారంలా మారిపోయింది. ధరలు ఇప్పుడిప్పుడే కాస్త దిగుతున్నప్పటికీ.. సామాన్యుడు కొనలేని పరిస్థితి మాత్రం కొన్నిచోట్ల కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఫ్రీగా ఉల్లి దొరికితే ఎవరైనా ఎగబడి తీసుకుంటారు. ఒడిశాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి గడ్డలు రోడ్డుపై పడిపోయాయి. దాంతో వాటి కోసం స్థానికులు ఎగబడ్డారు. వాహనాలను ఆపి మరీ ఎత్తుకెళ్లారు.