కర్ణాటకలో విషం కలిపిన ప్రసాదం తిని 12మంది భక్తులు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మరో 40మంది అస్వస్థతకు గురై మైసూరు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం కుమారస్వామి పరామర్శించారు. మృతులకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.