పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకొని ఎక్కడికక్కడ బైఠాయించారు. పౌరసత్వ చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీల విద్యార్థులు, ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్లపై ఆందోళనలు చేయడంతో ఢిల్లీలోని NH-8పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీతో ప్రధాన నగరంతో పాటు NCR పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.