HOME » VIDEOS » National

చంద్రయాన్-2 విజయవంతం కావాలనీ.. మహిళల రంగుల రంగుల రంగోళి

కోట్లాది భారతీయుల చూపు చంద్రయాన్-2 పైనే.. భారత ప్రతిష్టను ఇనుమడింపజేసే ఈ మిషన్ భారత్‌ను సరికొత్త శక్తిగా నిలబెట్టనుంది. చంద్రయాన్-1కి కొనసాగింపుగా చేపట్టిన ఈ చంద్రయాన్-2 ఇటీవలే సాంకేతిక కారణాలతో నిలిచిపోగా.. ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రయోగం విజయవంతం కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్-2లో ఆర్బిటర్,ల్యాండర్,రోవర్ అనేవి అత్యంత కీలకం. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహ ప్రయోగానికి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రుడిపై ఖనిజ నిక్షేపాలు, ఉపరితల వాతావరణ విషయాలను తెలుసుకోవడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం మధ్యాహ్నాం 2.43గం.కు చంద్రయాన్-2 రాకెట్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ సందర్బంగా సూరత్‌లో కొంత మంది మహిళలు రకరకాల రంగులతో చంద్రయాన్ విజయవంతం కావాలని దానికి సంబందించిన ముగ్గులు వేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు.

webtech_news18

Top Stories