HOME » VIDEOS » National

Video : మున్సిపల్ ఇంజనీర్‌పై బురద కుమ్మరించిన ఎమ్మెల్యే..

టీవలే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియా మున్సిపల్ అధికారిపై బ్యాట్‌తో దాడి చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే మహారాష్ట్రకు చెందిన నితీశ్ రాణే అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ మున్సిపల్ ఇంజనీర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై బురద నీళ్లు కుమ్మరించి దౌర్జన్యం చేశాడు.ముంబై-గోవా హైవేపై ఉన్న కంకవాలి బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హైవేని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే..బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను చూసి అక్కడే ఉన్న ఇంజనీర్ ప్రకాశ్ శేద్కర్‌పై నిప్పులు చెరిగారు. రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నా.. మరమ్మత్తులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు.ఎమ్మెల్యే ప్రశ్నలకు ఇంజనీర్ వివరణ ఇస్తున్నా.. అతని మాటలు వినిపించుకోకుండా దాడికి యత్నించారు.ప్రకాశ్‌కు బురద నీళ్లతో సన్మానం చేయాలని ఎమ్మెల్యే నితీశ్ రాణే వ్యాఖ్యానించడతో.. వెంటనే ఆయన అనుచరులు అన్నంత పనిచేశారు. బకెట్‌లో బురద నీళ్లు తీసుకొచ్చి ఆయనపై కుమ్మరించారు.అంతేకాదు, ఆ ఇంజనీర్‌ను తాళ్లతో అక్కడే బ్రిడ్జికి కట్టేసేందుకు యత్నించారు.

webtech_news18

Top Stories