HOME » VIDEOS » National » BOREWELL CHILD DIED AT LAST RESCUE OPERATION STOPPED IN TAMILNADU NK

Video : బోరుబావిలో చిన్నారి మృతి... కన్నీటి సంద్రమైన తల్లి

ఇండియా న్యూస్08:48 AM October 29, 2019

తమిళనాడు తిరుచ్చాపల్లిలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుర్జిత్‌ను కాపాడుకోలేకపోయాం. నాలుగు రోజులుగా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. బోరు బావి నుంచీ కుళ్లిపోయిన వాసన రావడంతో... చిన్నారి చనిపోయాడని గుర్తించిన ఫైర్ సిబ్బంది... క్రేన్ ద్వారా... మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్నారి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 80 గంటలుగా చేసిన ఆపరేషన్ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం చిన్నారి బాడీ డీకంపోజింగ్ స్టేజీలో ఉంది. పిల్లాడి తల్లి... మృతదేహాన్ని చూసి కన్నీటి సంద్రమైంది. ఎప్పటికైనా బిడ్డను ప్రాణాలతో చూస్తాననుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. చిట్టి తండ్రి ప్రాణాలతో బయటకు రావాలని దేశమంతా కోరుకుంది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దీనిపై స్పందించారు. చిన్నారిని త్వరగా బయటకు తేవాలని కోరారు. ఎవరు ఎంతలా ప్రయత్నించినా ఫలితం దక్కకుండా పోయింది.

webtech_news18

Top Stories